WGL: కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి వారిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని, నర్సంపేట నియోజకవర్గాన్ని స్వామివారి అనుగ్రహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.