AP: రాష్ట్ర ప్రజలకు APSDMA బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. కోస్తా, రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిన్న పొట్టిపాడు(కడప)లో 43.8, వరదయ్యపాలెం(తిరుపతి)లో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.