TG: ఈ నెల 18న మేడిగడ్డకు BRS నేతల బృందం వెళ్లాలని నిర్ణయించింది. మేడిగడ్డను ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల బీఆర్ఎస్ నేతలు సందర్శించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమైన మాజీ మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.