AP: కర్నూలు సభా వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మన కూటమి 15ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలి. ఇబ్బందులున్నా.. ఏమున్నా తట్టుకొని నిలబడాలి. అలా ఉంటేనే ప్రజల నమ్మకాన్ని సడలించకుండా.. వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తాం. మేమందరం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో సమిష్టిగా పనిచేస్తాం’ అని ఉద్ఘాటించారు.