AP: కూటమి ప్రభుత్వంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘లడ్డూ కల్తీపై అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడారు. నన్ను, సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలన్నది వారి ఉద్దేశం. మమ్మల్ని దోషులుగా సిట్ ఎక్కడా పేర్కొనలేదు. నా కూతురి పెళ్లిని హిందూ సంప్రదాయం ప్రకారం చేశాను. ఈ పెళ్లికి బాలకృష్ణ, రామ్మూర్తినాయుడు వచ్చారు’ అని భూమన వెల్లడించారు.