AP: అమరావతి పరేడ్ గ్రౌండ్ వేదికగా అగ్నిమాపక శాఖకు చెందిన కొత్త వాహనాలు, అత్యాధునిక పరికరాలను సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో అగ్నిమాపక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.252.93 కోట్లతో ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందులో భాగంగా రూ.33.25 కోట్ల విలువైన అధునాతన వాహనాలు, రక్షణ పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.