AP: విజయవాడలో మహిళా భద్రత వారోత్సవాలు జరిగాయి. సత్యనారాయణపురం నుంచి శివాజీ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడారు. ‘NDA ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఉమెన్&చైల్డ్ సేప్టీవింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయం. మహిళపై నేరాలు 4.4 శాతం తగ్గాయి. మహిళల అభివృద్ధి, దేశ అభివృద్ధికి కొలమానం’ అని పేర్కొన్నారు.