TG: హైదరాబాద్లో ఈ నెల 27న శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తుతోపాటు, అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ఉంటుందని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. శోభాయాత్రను మధ్యాహ్నం 1 గంటల నుంచి ప్రారంభించాలని నిర్వాహకులకు సూచించారు.