TG: డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. తాము కూడా దక్షిణాది వ్యక్తులమేనని, ఇక్కడి ప్రయోజనాలను దెబ్బతీయనివ్వమని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు.