TG: HYDలోని బాలాపూర్ లడ్డూ వేలం పాట కోసం రంగం సిద్ధమైంది. ఈ ఉదయం 9.30 గంటలకు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట వేయనున్నారు. 31 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ లడ్డూ కోసం స్థానికులు, స్థానికేతరుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ వేలం పాటలో పాల్గొనే వ్యక్తులు ఉత్సవ సమితి వద్ద రూ. 5వేలతో పేర్లు నమోదు చేసుకోవాలి. గతేడాది ఈ లడ్డూ రికార్డు స్థాయిలో రూ. 30.01 లక్షల ధర పలికింది.