AP: ఢిల్లీలో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలని విన్నవించారు. ఈ క్రమంలో నారాయణ ప్రతిపాదనలపై నిర్మల సానుకూలంగా స్పందించారు.