AP: మంగళగిరిలో నిర్వహించిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. వన్యప్రాణులను కాపాడేందుకు హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు ప్రారంభించారు. రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగని తెలిపారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు పవన్ వెల్లడించారు.