MBNR: జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామానికి చెందిన బాలరాజు గౌడ్ ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బాల్య స్నేహితులు సోమవారం శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శివలింగం, ప్రభు శంకర్, రాజు, రాములు, మల్లేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.