AP: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవదాయశాఖ అధికారి శాంతిని పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా ఆమెకు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ అధికారులు ఆమెను సుదీర్ఘంగా విచారించనున్నారు. ఈ సోదాల్లో లభించిన కీలక పత్రాలు, ఆస్తుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.