AP: శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో రామ్మోహన్ పాల్గొని మాట్లాడారు. జిల్లా నుంచి వలసలు లేకుండా చేసేందుకు కష్టపడి పనిచేస్తామని, మూలపేటలో పోర్టు పూర్తి చేయబోతున్నట్లు పేర్కొన్నారు. తీరప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.