AP: సీఎం చంద్రబాబు తన పుట్టిన రోజు సందర్భంగా సతీమణి భువనేశ్వరితో కలిసి కేక్ కట్ చేశారు. ‘జీవితంలో మరో ఏడాది పూర్తి చేసుకుంటున్న వేళ.. ఎప్పటికీ అండగా నిలిచే జీవిత భాగస్వామితో కలిసి నా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఆమె సహకారం, ఆప్యాయత వల్లే జీవితం మరింత అర్థవంతంగా మారుతోంది’ అని ఆయన ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.