TG: మొదటి విడతలో 70 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఉన్నా.. పేదల అభివృద్ధికి రాజీ పడమని అన్నారు. ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత కరెంట్, రేషన్, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందని పేర్కొన్నారు.