AP: ఉగాది పండుగ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. మొత్తం 164 మందిని అవార్డులకు ఎంపిక చేయగా, వీరిలో 40 మందికి ‘కళారత్న’, 124 మందికి ‘ఉగాది పురస్కారాలు’ దక్కాయి. సాహిత్యం, కళలు, సామాజిక సేవ వంటి 15 విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ గౌరవం దక్కింది.