AP: ఒంగోలు నియోజకవర్గ YCP నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసింది. రెండేళ్లకే రూ.3.30 లక్షల కోట్ల అప్పులు చేశారు. YCP హయాంలోని పథకాలన్నీ రద్దు చేశారు. అమరావతి పనుల్లో తీవ్రమైన అవినీతి జరుగుతోంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది’ అంటూ విమర్శించారు.