AP: వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫొటోలు పట్టుకున్నారనేది అవాస్తమవమని MLC బొత్స సత్యానారాయణ తెలిపారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని మండలి ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని పత్రికల్లో ప్రచురించినందుకు గాను మండలి ఛైర్మన్ కూడా విచారం వ్యక్తం చేశారన్నారు.