TG: లండన్ పర్యటన ముగించుకుని మాజీమంత్రి హరీష్ రావు HYD చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన 25 ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిదన్నారు. తనపై కొంత కాలంగా దుష్ప్రచారం జరుగుతోందని.. ఆ వ్యాఖ్యలనే ఇటీవల కవిత మళ్లీ ప్రస్తావించారని పరోక్షంగా స్పందించారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో? వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. కాగా, ఆయన కవిత పేరును ఎక్కడా చెప్పలేదు.