TG: డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత దేవ్జీ లొంగిపోయిన విషయం తెలిసిందే. దేవ్జీతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె రాజిరెడ్డి లొంగిపోయారు. వారికి డీజీపీ రివార్డు చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని సూచించారు.