TG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్లో ఉన్న పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 27 మంది డిప్యూటీ సీఈవోలు.. సీఈవోలుగా పదోన్నతి పొందగా, 55 మంది MPDOలు డిప్యూటీ CEOలుగా పదోన్నతి పొందారు. ఖాళీగా ఉన్న 28 MPDO పోస్టుల నుంచి డిప్యూటీ సీఈవోలుగా, 15 మంది డిప్యూటీ సీఈవోల నుంచి సీఈవోలుగా పదోన్నతులు కల్పిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.