TG: వికారాబాద్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను వికారాబాద్ PSకు తరలించారు. పరిగిలో పరిశ్రమల పేరుతో చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా ఆమె ఉదయం నుంచి.. వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేస్తున్నారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.