ఐపీఎల్లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఎంపికపై వస్తున్న విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. క్రికెట్‌పై రాజకీయ భారం వేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయం, క్రికెట్‌ను కలిపి చూడటం సరికాదని.. క్రీడలను క్రీడలుగానే చూడాలని సూచించారు. పొరుగు దేశాలతో సంబంధాలు ఎలా ఉన్నా, ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకోవద్దని పరోక్షంగా వ్యాఖ్యానించారు.