AP: జగన్ ‘మావిగన్ జోకర్’గా మిగిలారని PCC చీఫ్ షర్మిల ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్లు కట్టుకున్నారని మండిపడ్డారు. పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి.. కల్తీ మద్యం అమ్మి ఓన్లీ క్యాష్ మాఫియా ఎందుకు చేశారని నిలదీశారు. YCPలో YSR ఐడియాలజీ ఉంటే అధికారంలోకి వచ్చాక కూడా.. జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.