TG: బీజేపీ నేత లక్ష్మణ్‌ను రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు కలిశారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పేదలు, రైతులు నష్టపోయారని మండిపడ్డారు. HMDAకు అవతల RRR నిర్మాణం జరగాలని డిమాండ్ చేశారు. పేదల భూములను లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. బాధితులకు ఎలాంటి నష్టం జరగకుండా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.