TG: కార్పొరేషన్ల పేరుతో అన్నివర్గాలను మోసం చేసిందని మాజీమంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ‘ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా పనులు సున్నా. 24 గంటల్లో ఖమ్మంకు మెడికల్ కాలేజ్ KCR మంజూరు చేశారు. బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానిది చిన్నచూపు. యాదవులకు గొర్రెలు ఎప్పుడిస్తారో చెప్పాలి? పొంగులేటి అవినీతిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే మమ్మల్ని సస్పెండ్ చేశారు’ అని ఆరోపించారు.