TG: డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఎంపీ ఈటల రాజేందర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. మరణించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు అంబేద్కర్ అంటూ కొనియాడారు. అణగారిన వర్గాల హక్కులు కాపాడాలని జీవితాంతం పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన రాజ్యాంగం వల్లే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు.