AP: రాష్ట్రానికి మరో కీలక కంపెనీ రానుంది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా, జపాన్ సంయుక్త సంస్థ ప్రొటీరియల్ ప్రకటించింది. ‘మెట్గ్లాస్ ఇండియా’ పేరుతో కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ‘అమోర్పస్ అల్లాయ్ రిబ్బన్’ను సంస్థ ఉత్పత్తి చేయనుంది. తొలిదశలో సుమారు రూ.700 కోట్లతో పెట్టుబడి పెట్టనుంది.