TG: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. సోలార్ విద్యుత్ వినియోగంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని.. ప్రతి పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని చెప్పారు. పాఠశాలల్లో డ్రగ్స్ పై కఠిన నిఘా ఉంచాలని.. యూరియా యాప్లో మార్పులు చేయాలని సూచించారు. అందుకు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు.