AP: రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘చంద్రబాబు అవినీతే దీనికి కారణం. రాజధాని పేరుతో చంద్రబాబు తన వారికి దోచిపెడుతున్నారు. రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చు పెడతామంటున్నారు. అమరావతి పేరుతో భయంకరమైన దోపిడీకి చంద్రబాబు తెరతీశారు. మావిగన్‌పై కొందరు కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు’ అని చెప్పారు.