TG: మూసీ పునరుజ్జీవనంలో భాగంగా బాపు ఘాట్ వద్ద తలపెట్టిన ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్ట్ ఇప్పుడు వందలాది కుటుంబాల పాలిట శాపంగా మారింది. ఈ క్రమంలో వారికోసం బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. ఇవాళ మధు పార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలతో బీజేపీ చీఫ్ రాంచందర్ రావు, బీజేపీ నేతలు సమావేశం కానున్నారు.