TG: జయంతి రోజే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కందికొండలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గుర్తుతెలియని దుండగులు అర్థరాత్రి సమయంలో ఈ విగ్రహాన్ని విరగ్గొట్టడంతో గ్రామస్తులు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఈ ఘటనపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపడుతున్నారు.