AP: గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో LPG సరఫరాకు ఇబ్బందులు లేవు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల LPG నిల్వలు ఉన్నాయి. మరికొన్ని మెట్రిక్ టన్నులు అందుబాటులోకి రాబోతోంది. ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు కొరత లేకుండా చూడాలి. గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపు.. మెరుగైన పంపిణీ జరిగేలా చూడాలి’ అని పేర్కొన్నారు.