AP: రాష్ట్రంలో పదో తరగతి పేపర్ల వాల్యుయేషన్ ఏప్రిల్ 4 నుండి 13 వరకు జరగనుంది. పారదర్శకత కోసం CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈసారి ట్యాబ్ల ద్వారా మార్కులను ఎప్పటికప్పుడు నమోదు చేసే కొత్త విధానాన్ని తెచ్చారు. ఏప్రిల్ మూడో వారంలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వాల్యుయేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.