వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. క్రూడ్ పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10% తగ్గించింది. ఈ నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల మొత్తం సుంకం 27.5% నుంచి 16.5% పడిపోతుంది. భారత్ తన వంటనూనెల అవసరాల కోసం 70% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లీటర్ నూనెపై ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.