TG: మూసీ అంశంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మూసీ పునరుజ్జీవాన్ని వ్యతిరేకిస్తున్నారా?.. లేక, నిర్వాసితులకు న్యాయం కోరుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలనేదే విపక్షాల ఎజెండా అని మండిపడ్డారు. బాపూ ఘాట్ విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.