W.G: నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరగాల్సిన మాధవాయిపాలెం ఫెర్రీ సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం వాయిదా పడినట్లు ఎంపీడీవో నాసరు రెడ్డి తెలిపారు. కొన్ని పరిపాలనా పరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేలం నిర్వహించే తదుపరి తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని, ఆసక్తి గల వారు ఈ మార్పును గమనించాలని కోరారు.