KDP: పోరుమామిళ్ల మండలం కవలకుంట్ల గ్రామ పంచాయతీలోని బుచ్చం పల్లె గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గత 40 ఏళ్లుగా రోడ్డు లేక చిన్నపాటి వర్షం పడితే ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. గ్రామస్థులు టీడీపీ ఇన్ఛార్జ్ రితేశ్ రెడ్డికి విన్నవించుకోగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి రూ.35 లక్షల సిమెంట్ రోడ్డు మంజూరు చేయించారు. గురువారం రోడ్డు పనులు ప్రారంభించారు.