ELR: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గురువారం సాయంత్రం భీమడోలు మండలం కొత్త అంబారుపేట మసీదు వద్ద ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు. సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ, నాయకులు పాల్గొన్నారు.