AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించనున్నార. ఈ మేరకు ఇవాళ సాయంత్రమే ఆయన విశాఖకు చేరుకుని, రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక పాడేరు పర్యటనలో భాగంగా రేపు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాగా ఎండల తీవ్రత దృష్ట్యా రేపు పిఠాపురం వేదికగా జరగాల్సిన ‘జనసేన ఆవిర్భావ దినోత్సాల’ను పవన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.