AP: మంత్రి అచ్చెన్నాయుడుపై వ్యాఖ్యల కేసులో YCP నేత పేరాడ తిలక్ టెక్కలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి ఆయనను PSలోనే ఉంచడంపై ఆ పార్టీ నేత దువ్వాడ వాణి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. స్టేషన్ పైకి దూసుకెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. నిందితుల పేర్ల నమోదు విషయంలో పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.