ఉక్రెయిన్‌కు అమెరికా రూ.6 వేల కోట్ల మిలిటరీ సాయం చేయనుంది. ల్యాండ్ మైన్లు, యాంటీ ఎయిర్, యాంటీ ఆర్మర్ వెపన్లను అగ్రరాజ్యం అందించనుంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించకముందే జో బైడెన్ ప్రభుత్వం శరవేగంగా సాయం అందజేస్తుంది. భవిష్యత్తులో ఉక్రెయిన్‌కు ఇలాంటి సహాయం అందకపోవచ్చనే ఆలోచనతో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.