TG: రాష్ట్రంలోని 160 ఇంజినీరింగ్ కాలేజీలకు 2025-28 బ్లాక్ పీరియడ్‌కు కొత్త ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో(6) విడుదల చేసింది. అత్యధికంగా సీబీఐటీ ఫీజు రూ.1.83 లక్షలు కాగా, వాసవి కాలేజీ రూ.1.75 లక్షలతో రెండో స్థానంలో ఉంది. మొత్తం 33 కాలేజీల్లో ఫీజు రూ.లక్ష దాటింది. 19 కాలేజీల్లో ఫీజులు తగ్గగా, 70 కాలేజీల్లో ఫీజులు పెంచలేదు. కనిష్ట ఫీజును రూ.45 వేలుగా నిర్ణయించారు.