AP: మహానాడు తొలి రోజున పార్టీకి రూ.11 కోట్ల భారీ విరాళాలు వచ్చినట్లు TDP ప్రకటించింది. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు రూ.5 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి రూ.1.50 కోట్లు, సానా సతీష్ రూ.1.50 కోట్లు, భాష్యం రామకృష్ణ రూ.1 కోటి, మరి కొందరు నాయకులు మిగిలిన మొత్తాన్ని పార్టీకి విరాళంగా ఇచ్చారని TDP అధినేత చంద్రబాబు ప్రకటించారు.