TG: నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా.. 50 శాతం జనాభా, మరో 50 శాతం GSDP ఆధారంగా ‘హైబ్రిడ్ మోడల్’లో డీలిమిటేషన్ చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల కోటాను తగ్గించవద్దని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.