TG: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం భూముల్లో సగానికి పైగా(51.4శాతం) కేవలం 7 కులాల వారి యాజమాన్యంలోనే ఉందని కులగణన సర్వేలో తేలింది. రెడ్డి, యాదవ, లంబాడీ, ముదిరాజ్, మున్నూరుకాపు, కురుమ, కోయ, కులాల వారు రాష్ట్ర మొత్తం జనాభాలో 32 శాతం కాగా, వీరి వద్దే 51.4 శాతం భూమి ఉంది. 4.8 శాతం మాత్రమే ఉన్న రెడ్డి కులం.. మొత్తం భూముల్లో 13.5 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది.