TG: హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో బీఆర్ఎస్ వర్క్‌షాప్ ప్రారంభమైంది. మాజీ మంత్రులు KTR, హరీశ్ రావు.. పార్టీ ప్రజాప్రతినిధులకు అసెంబ్లీ వ్యవహారాలు, వ్యూహాలపై అవగాహన కల్పించేందుకు ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. సభలో ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరించాలి, ప్రజల సమస్యలను ఏ విధంగా లేవనెత్తాలి అనే అంశాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.