కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి మొహ్సినా కిద్వాయ్ (94) కన్నుమూశారు. నోయిడాలోని మెట్రో ఆస్పత్రిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో కిద్వాయ్ కీలకమైన శాఖలను నిర్వర్తించారు. లోక్సభ, రాజ్యసభ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా ఆమె సభ్యురాలిగా పనిచేశారు.